ఆర్టీసీని బతికించిన ఘనత వైఎస్‌ఆర్దే.. | ys rajashekar reddy gave new life to RTC, sunitha lakshma reddy | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని బతికించిన ఘనత వైఎస్‌ఆర్దే..

Published Fri, May 8 2015 2:05 PM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

ఆర్టీసీని బతికించిన ఘనత వైఎస్‌ఆర్దే.. - Sakshi

ఆర్టీసీని బతికించిన ఘనత వైఎస్‌ఆర్దే..

సంగారెడ్డి: కష్టాల్లో ఉన్న ఆర్టీసీని బతికించిన ఘనత దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డిదేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.  మెదక్ జిల్లా సంగారెడ్డిలో మీడియా సమావేశంలో  శుక్రవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

సంగారెడ్డిలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సునీతా లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు.  ఆర్టీసీని బతికించిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులకు 14శాతం ఉన్న ఫిట్‌మెంట్‌ను 25శాతంకు పెంచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి రూ. 1000కోట్ల ఆర్థిక సహాయం చేసింది కూడా వైఎస్ కాలంలోనే అని అన్నారు.  ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement