
కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కుమార్ యాదవ్ తదితరులు
అబిడ్స్ : కేంద్రంలో ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు సమీపిస్తున్నాయని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అ«ధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ బచావో ఆందోళన్‌లో పాల్గొనేందుకు ఆయన నగరం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..... పెట్రోల్, డీజిల్ ధరలు 60 ఏళ్లలో పెరగని విధంగా మోదీ ప్రభుత్వం పెంచిందన్నారు. దీంతో ప్రజలపై ధరల ప్రభావం తీవ్రంగా పడిందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారన్నారు.