ఇందూరు: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం పది నిముషాలలోనే ఏడు కమిటీల ఎన్నికలు ఏకగ్రీవంగా చకచకా జరిగిపోయాయి. జడ్‌పీ చైర్మన్ అధ్యక్షతన మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ 12:10నిముషాలకు ముగిసింది. ముందే నిర్ణయించుకున్న కమిటీల అధ్యక్షులు, సభ్యుల పేర్లను జడ్‌పీ సీఈఓ రాజారాం చదివిన వెం టనే జడ్‌పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టి ఆమోదించారు.
24 మంది సభ్యులున్న టీఆర్‌ఎస్‌కే ఆయా కమిటీలకు నేతృత్వం వ హించే అవకాశం దక్కిం ది. కాంగ్రెస్ పార్టీకి 12 మంది జడ్‌పీటీసీలు ఉన్నప్పటికీ ఏ ఒక్క కమి టీ అధ్యక్ష పదవి లభించలేదు. జడ్‌పీలో మొ త్తం ఏడు కమిటీలు ఉండగా జడ్‌పీ చైర్మన్ దఫేదార్ రాజు నాలుగు కమిటీలకు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆర్థిక-ప్రణాళిక, గ్రామీణాభి వృద్ధి, విద్య-వైద్యం, పనులు-నిర్మాణాల కమిటీలకు ఆయన అధ్యక్షత వహిస్తారు. జడ్‌పీ వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి వ్యవసాయ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
మహిళా సంక్షేమ కమిటీ అధ్యక్షురాలిగామోర్తాడ్ జడ్‌పీటీసీ ఎనుగందుల అమిత, సాంఘిక సంక్షేమ కమిటీ అ ధ్యక్షురాలిగా మాక్లూర్ జడ్‌పీటీసీ కున్యోత్ లత ఎన్నికయ్యారు. ఈ మూడు కమిటీలకు జడ్‌పీ చైర్మన్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరి స్తారు. ఒక్కో కమిటీలో ఎనిమిది మందిని స భ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జడ్ పీ చైర్మన్ మాట్లాడుతూ కమిటీల అద్యక్షులు, సభ్యులు శాఖల అభ్యున్నతికి, ప్రజల చెంతకు పథకాలు, ఫలాలు చేరవేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హ న్మంత్ సింధే, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పలువురు గైర్హాజరు
జడ్‌పీ స్థాయీ సంఘాల ఎన్నికల కోసం ఎంపీలు, ఎ మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్‌పీటీసీలకు రెండు రోజు ల ముందుగానే అధికారులు సమాచారం చేరవేశారు. అయితే కొందరు జడ్‌పీటీసీలు హాజరు కాలేదు. ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, స్వామిగౌడ్, డి. శ్రీనివాస్, అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, షకీల్, జీవన్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, హాజరు కాలేదు. ఎంపీ కవిత, మంత్రి పోచాం శ్రీని వాస్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్ కూడా హాజరు కాలేదు.
ముగిసిన జడ్‌పీ స్థాయీ సంఘాల ఎన్నికలు
Published Thu, Sep 4 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement