నీలాక్షిశర్మ
‘సినిమాల్లో అవకాశం వస్తే నా ఫేవరేట్ హీరో హృతిక్‌రోషన్‌తో నటిస్తా’ అని నిట్ క్యాంపస్ ప్రిన్సెస్ విజేత నీలాక్షిశర్మ పేర్కొన్నారు. నిట్ స్ప్రింగ్ స్ప్రీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ప్రిన్సెస్ ఫ్యాషన్ షోలో విజేతగా నిలిచిన నీలాక్షిశర్మ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఇవీ..
నమ్మలేకపోతున్నా..
వరంగల్ నిట్‌లో క్యాంపస్ ప్రిన్సెస్‌గా ఎంపికవడం నమ్మలేకపోతున్నా. ఇక్కడ చదువుకోవడం నా అదృష్టం. నిట్‌ను నా సొంత ఇంటిలా భావిస్తాను. ఈ ఏడాది ముంబాయిలో నిర్వహించే మిస్ ఇండియా–2018 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తా. నిట్ డైరెక్టర్, నా తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితులు ప్రవళిక, స్వాతి ప్రోత్సాహంతో క్యాంపస్ ప్రిన్సెస్‌గా విజయం సాధించా.
చదువు, మోడలింగ్ ప్రాధాన్యం..
వరంగల్ నిట్‌లో బీటెక్ తర్వాత ఎంఎస్ కోర్సు చేస్తూనే మోడలింగ్‌పై దృష్టిసారిస్తా.. మాది జార్ఖండ్. తండ్రి అనిల్‌కుమార్, తల్లి సీమాశర్మ, సోదరి జీలాక్షిశర్మ.. ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహిస్తుంటారు. నాన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫెర్స్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిస్ ఇండియా–2018 కాంటెస్ట్‌లో గెలుపొంది మహిళా సాధికారత కోసం కృషి చేస్తా.
మానుషీచిల్లర్ స్ఫూర్తితో..
మిస్ ఇండియా– 2017 విజేత మానుషీచిల్లర్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్యాంపస్ ప్రిన్సెస్ పోటీల్లో పాల్గొన్నా. కేవలం వారం రోజులు మాత్రమే సాధన చేశా. గతేడాది స్ప్రింగ్ స్ప్రీలో నిర్వహించిన అల్యూర్ ఫ్యాషన్ షోలో ఐదుగురితో కలిసి ర్యాంపుపై క్యాట్ వాక్ చేశాను. మా టీం విజేతగా నిలిచింది. ఆ విజయంతో కేవలం వారంరోజుల పాటు మాత్రమే ప్రాక్టీస్ చేశాను.
Comments
Please login to add a commentAdd a comment