టాప్లో తెలుగురాష్ట్రాలు
న్యూఢిల్లీ. తెలుగు ప్రజలు మరోసారి వార్తల్లోనిలిచారు. సులువుగా వ్యాపార నిర్వహణలో తెలుగురాష్ట్రాలు తమ సత్తా చాటుకున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు టాప్ ప్లేస్ లో నిలిచాయి. ప్రపంచ బ్యాంకు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) సోమవారం విడుదల చేసిన జాబితాలో అగ్రస్థానాన్ని అక్రమించాయి. ఇరు రాష్ట్రాల మధ్య పోటాపోటీగా సాగిన ఈ పోటీలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు 340 కేటగిరీల్లో 98.78 శాతం దక్కించుకున్నాయి. కాగా గుజరాత్ తన మొదటి స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానంతో సరిపెట్టుకోగా, ఛత్తీస్ గఢ్ నాలుగవ స్థానాన్ని నిలుపుకుంది. ఆ తరువాత స్థానాల్లో మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి.
కాగా కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ "వర్ధమాన నాయకులు" కేటగిరీలో ఉత్తమంగా నిలిచాయి. త్వరితగతిన అభివృద్ధి చెందాల్సిన గ్రూప్ లో తమిళనాడు, డిల్లీ నిలిచాయి.