ఐఫోన్, ఐప్యాడ్లపై రూ.23వేల క్యాష్బ్యాక్
ఐఫోన్, ఐప్యాడ్లపై రూ.23వేల క్యాష్బ్యాక్
Published Sat, Nov 19 2016 9:05 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ రెండూ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. ఆపిల్, సిటీ బ్యాంకు రెండు జతకట్టి ఓ స్పెషల్ కోంబో ఆఫర్ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.23వేల వరకు క్యాష్ బ్యాక్ను అందిచనున్నట్టు ఆపిల్ తెలిపింది. అయితే ఈ కొత్త ఫోన్లతో పాటు ఐప్యాడ్ కూడా కొనుగోలుచేసిన వారికే ఈ కోంబో ఆఫర్ వర్తించనుంది. అదేవిధంగా ఐప్యాడ్ కొనుగోలు చేసిన వారికీ ఈ క్యాష్ బ్యాక్ వర్తించనుంది. కానీ వారు కూడా ఆపిల్ లేటెస్ట్గా విడుదల చేసిన ఐఫోన్ మోడల్స్ ఫోన్లలో ఏదో ఒకదానికి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని ఒకేసారి, ఒకేస్టోర్లో కొనుగోలు చేయాలి. ఈ ఆఫర్ కేవలం సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు మాత్రమే వర్తించనుంది. ఒకవేళ అవసరమైతే వీటిని కొనుగోలు చేసేటప్పుడు ఇచ్చే ఫోన్ నెంబర్ కూడా రెండింటిలోనూ ఒకేలా ఉండాలి.
ఆపిల్-సిటీబ్యాంకు అందిస్తున్న ఐఫోన్-ఐప్యాడ్ కోంబో ఆఫర్ కేవలం ఎంపికచేసిన ఆఫ్లైన్ ఆపిల్-ఆథరైజడ్ రీసెల్లర్స్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ శుక్రవారం నుంచి ప్రారంభమై, 2016 డిసెంబర్ 31కి ముగియనుంది. ఆఫర్ కాలంలో కస్టమర్లు గరిష్టంగా నాలుగు లావాదేవీలు మాత్రమే జరపాల్సి ఉంటుంది. ప్రతి నెలా రెండు లావాదేవీలకు కంపెనీ అనుమతించనున్నట్టు తెలిపింది. ఐఫోన్ 7 లేదా ఐఫోన్ 7 ప్లస్ కొనుగోలు చేసే కస్టమర్లు ఐప్యాడ్ మినీ2, ఐప్యాడ్ మినీ4ను కొనుగోలు చేస్తే, రూ.17వేల వరకు క్యాష్బ్యాక్ పొందనున్నారు. ఒకవేళ ఐప్యాడ్ ఎయిర్2 కొంటే, రూ.18వేలు, ఐప్యాడ్ ప్రొ మోడల్కు రూ.23వేల వరకు క్యాష్బ్యాక్ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ క్యాష్బ్యాక్ మొత్తాలు కొనుగోలు చేసిన తర్వాత 90 రోజుల్లో సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులో క్రెడిట్ కానున్నాయి.
Advertisement