దిఫు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఆదివారం ఉధృత రూపం దాల్చాయి. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్‌లో ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ నేతల ఆస్తులను ధ్వంసం చేశారు. దిఫులోని నీటిపారుదల ఇంజనీర్ కార్యాలయం, ఖాదీ బోర్డు, ప్రజా పనులు, భూమి రికార్డుల కార్యాలయాలకు నిప్పుపెట్టారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది.
మరోపక్క.. కర్బీ అంగ్లాంగ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కర్బీ అంగ్లాంగ్ స్వతంత్ర ప్రాదేశిక మండలికిచెందిన అఖిలపక్ష నేతలు సోమవారం ప్రధాని మన్మోహన్, యూపీఏ అధినేత్రి సోనియా, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలను కలవనున్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, కేంద్రం సానుకూల ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని అఖిలపక్ష ప్రతినిధి డేనియల్ టెరోన్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నుంచి చేయాలనుకున్న100 గంటల బంద్‌ను వాయిదా వేస్తున్నామన్నారు. పశ్చిమ బెంగాల్లో గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గూర్ఖా జనముక్తి మోర్చా డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో చేపట్టిన నిరవధిక బంద్ ఆదివారం రెండో రోజూ తీవ్ర ప్రభావం చూపింది.
అట్టుడుకుతున్న అస్సాం
Published Mon, Aug 5 2013 3:03 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement