మోసాల నివారణ శైశవ దశలోనే... | ASSOCHAM Indian cos yet to fully use whistle blowing mechanism : Survey | Sakshi
Sakshi News home page

మోసాల నివారణ శైశవ దశలోనే...

Published Tue, Aug 6 2013 3:55 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

మోసాల నివారణ శైశవ దశలోనే...

మోసాల నివారణ శైశవ దశలోనే...

న్యూఢిల్లీ: భారత కంపెనీల్లో మోసాలను అరికట్టే యంత్రాంగం ఆశించిన మేరకు పనిచేయడం లేదని ఎర్నస్ట్ అండ్ యంగ్ తో కలిసి ఆసోచామ్ నిర్వహించిన సర్వేలో తేలింది. కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలను వేరే మార్గాల ద్వారా ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారని ఈ సర్వే వెల్లడించింది.
 
  మరిన్ని వివరాలు...,

  •   కంపెనీకి ఆర్థికంగా నష్టాలు కలుగజేయడం, లేదా కంపెనీ పేరుప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేయడం వంటివి -ఇలాంటి మోసాలే కంపెనీల్లో అధికంగా జరుగుతున్నాయి.
  •  ‘‘విజిల్ బ్లోయింగ్’’(అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం) విధానం భారత్‌లో ఇంకా శైశవదశలోనే ఉంది. ఈ విధానాన్ని భారత కంపెనీలు ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు.
  •   అమెరికా తదితర దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ విధానాన్ని కంపెనీల బిల్లులో నిర్దేశించారు. గత డిసెంబర్‌లో లోక్‌సభ ఆమోదం పొందిన ఈ కంపెనీల బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లోనే రాజ్యసభ ఆమోదం పొందే అవకాశాలున్నాయి.
  •   వ్యయాలను అధికం చేసి చూపడం, కొనుగోలు ఆర్డర్లలో గోల్‌మాల్ చేయడం, ఇతర  అవకతవకలను టెక్నాలజీ సాయంతో సులభంగా గుర్తించవచ్చు. ఈ దిశగా భారత కంపెనీల ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement