మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌తోపాటు, ఇతర సూచీలలో నూ మార్పులను చేపట్టినట్లు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్(బీఎస్‌ఈ) తె లిపింది.
ముంబై: మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌తోపాటు, ఇతర సూచీలలో నూ మార్పులను చేపట్టినట్లు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్(బీఎస్‌ఈ) తె లిపింది. దీనిలో భాగంగా ఈ నెల 25 నుంచి సెన్సెక్స్‌లో ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌కు స్థానం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక ‘బీఎస్‌ఈ 100’ ఇండెక్స్‌లో సుజ్లాన్ ఎనర్జీ స్థానంలో ఆదిత్య బిర్లా నువోను చేరుస్తుండగా, సెన్సెక్స్‌లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ చోటు కోల్పోనుంది. ఈ బాటలో బ్యాంకెక్స్ నుంచి యూనియన్ బ్యాంక్‌ను, టెక్ ఇండెక్స్ నుంచి ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఈరోస్ ఇంటర్నేషనల్, నవ్‌నీత్ పబ్లికేషన్స్, ఆన్‌మొబైల్ గ్లోబల్, వక్రంగీ సాఫ్ట్‌వేర్‌లను మినహాయిస్తోంది. టెక్ ఇండెక్స్‌లో హెక్సావేర్, జస్ట్ డయల్, పీవీఆర్ తదితరాలను చేర్చనుంది. ఇదే విధంగా మారికో, పీఅండ్‌జీ ైెహ జీన్, బేయర్ క్రాప్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, పేజ్ ఇండస్ట్రీస్, మైండ్‌ట్రీ, సుప్రీం ఇండస్ట్రీస్ తదితరాలను బీఎస్‌ఈ-200లో చేర్చనుంది.