మహేశ్-మణిరత్నం చిత్రం ఎందుకు ఆగిందంటే.. | because of settings Mani Ratnam-mahesh movie was shelved, says Writer Jeyamohan | Sakshi
Sakshi News home page

మహేశ్-మణిరత్నం చిత్రం ఎందుకు ఆగిందంటే..

Published Thu, Sep 8 2016 11:38 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

మహేశ్-మణిరత్నం చిత్రం ఎందుకు ఆగిందంటే..

మహేశ్-మణిరత్నం చిత్రం ఎందుకు ఆగిందంటే..

దక్షిణాది దర్శక దిగ్గజం మణిరత్నం కొన్నేళ్ల ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు 'పొన్నియిన్ సెల్వన్'. మహేశ్ బాబు, విజయ్, అనుష్క శెట్టి, విశాల్ ను ప్రధాన పాత్రల్లో తీసుకొని ఈ చారిత్రక కథను భారీ ఎత్తున నిర్మించాలని ఆయన భావించారు. కానీ, ప్రీ- ప్రోడక్షన్ దశలోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.

ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ సినిమా పట్టాలు ఎక్కకపోవడంతో అనేక వదంతులు వచ్చాయి. మహేశ్, విజయ్, అనుష్క వంటి భారీ తారాగణంతో తెరకెక్కించాలనుకున్న ఈ చారిత్రక సినిమాకు రూ. 200 కోట్ల బడ్జెట్ అవుతుందని భావించారని, అంత బడ్జెట్ తో సినిమా తీయడం ఆర్థికంగా ఆచరణసాధ్యం కాకపోవడంతో దీనిని మధ్యలోనే వదిలేశారని వార్తలు వచ్చాయి.

అయితే, ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం మణిరత్నంతో కలిసి పనిచేసిన రచయిత జయమోహన్ తాజాగా ఈ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందో స్పష్టంగా కారణాలు తెలిపారు. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన 'తమిళనాడులో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ ఏ దేవాలయంలోనూ ఈ సినిమా షూటింగ్ కు అనుమతి లభించలేదు. దీంతో భారీస్థాయిలో దేవాలయల సెట్టింగ్లు వేసి.. అందులో షూటింగ్ చేద్దామని మణిరత్నం నిర్ణయించారు. అయితే, ఈ సెట్టింగ్ ల కోసమే రూ. 50 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కతేలడంతో, అది ఆర్థికంగా సాధ్యం కాదని తేలింది. దీంతో ప్రీ-ప్రోడక్షన్ దశలోనే సినిమా ఆగిపోయింది' అని ఆయన చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement