
పెద్దనోట్ల రద్దుపై బిల్‌గేట్స్ ఏమన్నారంటే?
మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రముఖ మానవతావాది బిల్ గేట్స్‌ను తాజాగా పెద్దనోట్ల రద్దుపై ‘నో ఒపీనియన్’ అంటూ స్పందించారు.
మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రముఖ మానవతావాది బిల్ గేట్స్‌ను తాజాగా పెద్దనోట్ల రద్దుపై ‘నో ఒపీనియన్’ అంటూ స్పందించారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్లను రద్దుకు మద్దతునిచ్చినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై, పెద్దనోట్ల రద్దుపై స్పందించాలని ‘ద హిందూ’ దినపత్రిక రిపోర్టర్ కోరగా.. ‘నో ఒపీనియన్’ (నాకు తెలియదు) అని బదులిచ్చారు.
భారత్ శరవేగంగా డిజిటలైజ్ అవుతున్నదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆధార్‌కార్డు విధానం కూడా అద్భుతమని ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికపై స్పందించాలని కోరగా.. దాని గురించి చెప్పడానికి ఏమీ లేదని, ఎవరూ అధ్యక్షుడైనా, ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా తాము వారితో పనిచేస్తామని వెల్లడించారు.