లండన్: బ్రిటన్ లోని హెచ్చరిల్లుతున్న ఇస్లామిక్ తీవ్రవాద భావజాలంపై చర్యలు తీసుకునేందుకు ఆ దేశం సిద్ధమైంది. అక్కడి స్కూళ్లలో తీవ్రవాద విధానాన్ని తరగతుల్లో బోధిస్తున్నారన్నఓ మీడియా కథనంతో బ్రిటన్ దాన్నిరూపుమాపేందుకు నడుంబిగించింది. బ్రిటన్ స్కూళ్లలో తీవ్రవాద పోకడలు పెరుగుతున్నట్లు సండే టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించడంతో అప్రమత్తమైన బ్రిటన్ నివారణ చర్యలు చేపట్టింది. ఇస్లామిక్ భావజాలాన్నిస్కూళ్లలో పిల్లలకు నూరిపోస్తే అది వారి విద్యపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యా కార్యదర్శి మైఖేల్ గోవ్ అభిప్రాయపడ్డారు. దీనికి గాను ఇప్పటికే కొన్నిప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ఆ దేశ స్కూళ్లలో పని చేస్తున్నఇస్లామిక్ టీచర్లు మతపరమైన అంశాలను పిల్లలకు బోధించాలని చూస్తే తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ బృందాలతో పాటు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యయుల సమక్షంలో ఈ అంశాన్ని పర్యవేక్షించనున్నామన్నారు. ఎక్కడైతే సరైన విధానంలో విద్యను బోధించకుండా మతసంబంధమైన అంశాలను పిల్లలకు చెబుతారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.