బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ..
సిడ్నీ: బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వద్ద నుంచి ఎనిమిది నకిలీ బంగారపు లాఫింగ్ బుద్ధ విగ్రహాలు, దాదాపు 100 నకిలీ బంగారపు కడ్డీలు, ఐదు మొబైల్ ఫోన్లు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీతోపాటు నకిలీ పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. బంగారపు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని స్థానికంగా నివసిస్తున్న ఓ మహిళ అధికంగా సొమ్ము వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఆ బొమ్మ రాగితో తయారు చేసి... బంగారం పూత పూసిన నకిలీదని గుర్తించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది.
దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో ఇన్నర్ సిటీ అపార్ట్మెంట్లో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.