రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష వద్దు: కేంద్రం
దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష ఇవ్వద్దని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.
హంతకులు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్లో కనీస పశ్చాత్తాపం కూడా కనపడలేదని కోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల వారికి క్షమాభిక్ష పెట్టొద్దని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. వారి మరణ శిక్ష కేసుపై తన తీర్పును కోర్టు వాయిదా వేసింది.