
బంగారంపై వ్యవసాయ రుణాలివ్వొద్దు: సీఎం
సాక్షి, అమరావతి: బంగారాన్ని తనఖా పెట్టుకుని సాగు రుణాలిచ్చే విధానానికి ఇకపై స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు సూచించారు. బంగారంపై వ్యవసాయ రుణాలివ్వడం వల్ల వడ్డీలో నాలుగు నుంచి ఆరు శాతం వరకూ తేడా వస్తోందని తెలిపారు. పంటను పరిగణనలోకి తీసుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనల ప్రకారం రుణాలివ్వాలని స్పష్టం చేశారు.
సోమవారం విజయవాడలోజరిగిన 195వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాలను ప్రాథమిక రుణాలుగానే ఇవ్వాలన్నారు. భూమి వివరాలకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ పోర్టల్ సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.