రేపు భారత్కు ఛోటా రాజన్!
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ను మంగళవారం భారత్కు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఛోటా రాజన్ను తొలుత ఢిల్లీకి తీసుకురావచ్చని సమాచారం. రాజన్ను స్వదేశానికి తీసుకువచ్చే విషయంపై భారత అధికారుల బృందం ఇండోనేసియా అధికారులతో చర్చిస్తోంది. ముంబై, ఢిల్లీ పోలీసులు, సీబీఐ అధికారులతో కూడిన బృందం బాలి జైల్లో ఉన్న ఛోటా రాజన్ను కలిసింది.
గత వారం ఛోటా రాజన్ జింబాబ్వేకు పారిపోతుండగా బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో రాజన్పై 70కిపైగా కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ సరఫరా, బలవంతపు వసూళ్లు, హత్య తదితర కేసులు ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరుగుతున్న ఛోటా రాజన్ ఎట్టకేలకు ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డాడు.