టిబెట్ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చేరువలోని భారతీయ సరిహద్దుకు సమీపంలో కొత్తగా ఒక రైలు మార్గాన్ని చైనా నిర్మించబోతోంది.
బీజింగ్: టిబెట్ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చేరువలోని భారతీయ సరిహద్దుకు సమీపంలో కొత్తగా ఒక రైలు మార్గాన్ని చైనా నిర్మించబోతోంది. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ఈ రైలుమార్గం నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదిక ఇప్పటికే ఆమోదం పొందినట్టు చైనా అధికారిక వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపింది. టిబెట్‌లోని లాసా ప్రాంతాన్ని, ఎన్ రుుంగ్చీ ప్రాంతంతో అనుసంధానం చేస్తూ ఈ రైలుమార్గం నిర్మాణాన్ని ప్రతిపాదించినట్టు ‘జిన్హువా’ పేర్కొంది. 402కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి రూ. 6వేలకోట్లకు పైగా వ్యయవువుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిచేయుడానికి ఏడేళ్లు పడుతుందని భావిస్తున్నారు.
చైనా సరిహద్దు వెంబడి ఉన్న అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాల మీదుగా రహదారి వ్యవస్థను మెరుగుపరచాలని భారత్ సంకల్పించిన నేపథ్యంలో చైనా ఈ కొత్త రైల్వే నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇది, ఎత్తైన టిబెట్ పీఠభూమి ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రెండవ రైలువూర్గం అవుతుంది. ఇప్పటికే క్వింగాయ్ ప్రావిన్స్‌లోని జినింగ్‌నుంచి టిబెట్ ప్రావిన్స్ రాజధాని అయిన లాసా వరకు నిర్మించిన రైలుమార్గం 2006నుంచి వినియోగంలో ఉంటోంది.