బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించి ఆరు ఎఫ్‌ఐఆర్‌లపై విచారణను సీబీఐ పూర్తి చేసింది.
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించి ఆరు ఎఫ్‌ఐఆర్‌లపై విచారణను సీబీఐ పూర్తి చేసింది. వచ్చే సోవువారం సుప్రీం కోర్టుకు సమర్పించనున్న నివేదికలో ఈ విషయూన్ని తెలిపే అవకాశముంది. దర్యాప్తు ముగిసిన కేసులేంటన్నది మాత్రం బయటకు వెల్లడికాలేదు. తుది దశ తనిఖీని, సాంకేతిక లాంఛనాలను పూర్తిచేసిన తర్వాత కోర్టుకు తుది నివేదికను సీబీఐ అందిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కామ్‌లో ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్, జేఎల్‌డీ యూవత్మాల్, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్, జేఏఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్, వికాస్ మెటల్స్, గ్రేస్ ఇండస్ట్రీస్, గగన్ స్పాంజ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రాఠి స్టీల్ అండ్ పవర్, జార్ఖండ్ ఇస్పాత్, గ్రీన్ ఇన్‌ఫ్రా, కవుల్ స్పాంజ్, పుష్ప్ స్టీల్, హిందాల్కో, బీఎల్‌ఏ ఇండస్ట్రీస్, కాస్ట్రాన్ టెక్నాలజీస్, కాస్ట్రాన్ మైనింగ్ కంపెనీలపై సీబీఐ 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.