మెదక్ జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన బెంచ్‌క్లర్క్
మెదక్: సాక్షాత్తూ న్యాయస్థానంలోనే ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో గురువారం సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన లాల్‌సింగ్‌కు సంబంధించి ఓ భూవివాదం(సివిల్) కేసు మెదక్‌లోని మూడో అదనపు జిల్లా కోర్టులో 2009 నుంచి కొనసాగుతోంది. కేసుకు సంబంధించి ప్రత్యర్థికి సమన్లు పంపించడానికి ఈ కోర్టులో దశాబ్దకాలంగా సూపరింటెండెంట్(బెంచ్ క్లర్క్)గా కాంట్రాక్టర్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటరమణారెడ్డి.. లాల్‌సింగ్‌ను రూ.5 వేల లంచం ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.
దీంతో లాల్‌సింగ్ మెదక్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లాల్‌సింగ్ నుంచి వెంకటరమణారెడ్డి లంచం తీసుకుంటుడగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నిందితున్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు.
న్యాయస్థానంలోనే లంచం
Published Fri, Feb 12 2016 4:05 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement