రాజ్ కోట్: దళితులను చితక్కొట్టిన ఘటనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై గురువారం విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఆయనకు గట్టిగా బదులిచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుని గుజరాత్ పర్యటన రాజకీయ యాత్ర అని ఘాటుగా స్పందించింది.
గుజరాత్ లో ఒకరోజు పర్యటించిన రాహుల్ చనిపోయిన ఆవు చర్మాని ఒలిచినందుకు దెబ్బలుతిన్న దళిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో ఉన్న బాధితుల వద్దకు వెళ్లిన రాహుల్ కేవలం గుజరాత్ లోనే కాక, దేశం మొత్త ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని ఆరోపించారు. మోదీ గుజరాత్ మోడల్ గురించి తరచూ ప్రస్తావిస్తారని వారికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకను నొక్కొస్తారని అన్నారు.
దేశంలో ప్రస్తుతం రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. ఒకటి గాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ, అంబేద్కర్ లు పాటించిన మార్గమైతే.. రెండోది ఆర్ఎస్ఎస్, గోల్వాకర్, నరేంద్ర మోదీలు అనుసరిస్తున్న మార్గం అని ఆయన అన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య నుంచి మొదలుకుంటే ప్రస్తుతం గుజరాత్ లో దళితుల నిరసనలకు కారణం వీరి భావజాలమే అని చెప్పారు. కాగా, ఉనా ఘటనలో 16 మందిని అరెస్టు చేశారని, నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేశారు.
వారి భావజాలమే ఇందుకు కారణం: రాహుల్ గాంధీ
Published Thu, Jul 21 2016 10:35 PM | Last Updated on Tue, Aug 21 2018 2:29 PM
Advertisement