ఎన్నికల సంఘం ధృతరాష్ట్రుడిలా మారింది! | Dhritarashtra EC wants Duryodhan to win, says Kejriwal | Sakshi
Sakshi News home page

ఎన్నికల సంఘం ధృతరాష్ట్రుడిలా మారింది!

Published Mon, Apr 10 2017 12:42 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

ఎన్నికల సంఘం ధృతరాష్ట్రుడిలా మారింది! - Sakshi

ఎన్నికల సంఘం ధృతరాష్ట్రుడిలా మారింది!

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈవీఎంల ట్యాంపరింగ్‌ విషయంలో మరోసారి ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మరోసారి ఈసీని టార్గెట్‌ చేశారు. ‘ఎన్నికల సంఘం ధృతరాష్ట్రుడిలా మారింది. ధృతరాష్ట్రుడు ఏది చేసైనా తన కొడుకు దుర్యోధనుడికి అధికారం కట్టబెట్టాలని చూశాడు. ఇప్పడు ఈసీ అదేవిధంగా ప్రవర్తిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.

మరోవైపు ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంశంపై 13 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల సంఘాన్ని కలువబోతున్నారు. ఇదే అంశంపై ప్రతిపక్ష నేతల బృందం వచ్చే బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement