ఈవీఎంల ట్యాంపరింగ్‌ను 72 గంటల్లో నిరూపిస్తా!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని, తనకు 72 గంటల సమయాన్ని ఇస్తే ఈవీఎంలలోని సమాచారాన్ని తారుమారు చేయగలనని, అది కూడా ఈసీ నిపుణులు, కెమెరా సమక్షంలో చేస్తానని అన్నారు.
'72 గంటల సమయమివ్వండి. ఈవీఎంల సాఫ్ట్‌వేర్ ఏమిటో? దానిని ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో వెల్లడిస్తా' అని కేజ్రీవాల్ అన్నారు. రానున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేశారు. 'బ్యాలెట్ పేపర్లు తప్ప మరో ఆప్షన్ లేనేలేదు. ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయవచ్చునని అంతర్జాతీయంగా అందరికీ తెలిసిన విషయమే' అని అని అన్నారు.