స్మోకింగ్ అలవాటును పెంచుతున్నఈ సిగరెట్స్! | E-cigarettes may be as addictive for nicotine content | Sakshi
Sakshi News home page

స్మోకింగ్ అలవాటును పెంచుతున్నఈ సిగరెట్స్!

Published Tue, Jul 22 2014 3:11 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

E-cigarettes may be as addictive for nicotine content

ముంబై: పొగరాయుళ్లును కట్టిపడేద్దమని ప్రవేశపెట్టిన ఈ సిగరెట్స్(ఎలక్ట్రానిక్ సిగరెట్స్) తో మరింత ప్రమాదం చేకూరుతుందట. పొగాకు అలవాటుకు స్వస్తి పలికేందుకు తయారు చేసిన ఈ సిగరెట్స్ యువతను మరింత బానిసలుగా మారుస్తోందని తాజా అధ్యయనంలో తేలింది.  బ్యాటరీతో తయారు చేసే ఈ సిగరెట్స్ తో  పొగత్రాగాడాన్ని సాధ్యమైనంత  వరకు నివారించవచ్చని గత నాలుగు సంవత్సరాలుగా వీటిని ప్రవేశపెట్టారు. అయితే ఈ సిగరెట్స్ తో  పెను ముప్పు పొంచి ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ సిగరెట్స్ కు అలవాటు పడిన వారు సాధారణ సిగరెట్ల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. దీనికి తొలుత బానిసలైన వారు క్రమేపి నికోటిన్ కల్గిన మామూలు సిగరెట్లను సేవించడానికి సిద్ధమవుతున్నారని అన్నారు.

 

ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఈ సిగరెట్స్ పై నిషేధం విధించినా.. ఆన్ లైన్ లో మాత్రం అవి సులభంగా అందుబాటులో ఉండటంతో యువత దీనిపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని దేశాల్లో పొగాకు నియంత్రణపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నా.. మన దేశంలో మాత్రం ఆ తరహా విధానం లేకపోవడం బాధాకరమని హెల్త్ అసోసియేన్ ఆఫ్ ఇండియా వాలంటరీ భావనా ముఖోపాధ్యాయ తెలిపారు. పొగాకు త్రాగడం వల్ల వచ్చేప్రమాదంపై ఆస్ట్రేలియా, ఉరుగ్వే దేశాల్లో కచ్చితమైన నియమాలను పాటిస్తున్నా.. భారతదేశంలో మాత్రం ఆ తరహా విధానం లేదని ఆమె తెలిపారు. ఇకనైనా పొగత్రాగటంపై వచ్చే అనర్ధాలపై కఠిన వైఖరి అవలంభిచకపోతే ఆ ప్రభావం రాబోవు రోజుల్లో కనబడుతుందని ఆమె హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement