
చిన్నారుల దత్తత ఇక సులభం
- ఆన్‌లైన్ ప్రక్రియకు ‘కారా’ శ్రీకారం
- మార్గదర్శకాలను సరళీకరించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల దత్తత స్వీకరణ ప్రక్రియ సులభతరంగా మారింది. గతంలోని మార్గదర్శకాల ప్రక్రియ ప్రకారం పిల్లల దత్తత కోసం స్త్రీ శిశుసంక్షేమశాఖకు దరఖాస్తు చేసుకునే దంపతులు తమ వంతు కోసం కనీసం 3-4 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చే పరిస్థితి ఉం డగా కేంద్ర స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలను సరళీకరించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ప్రక్రియ ద్వా రా 4-5 నెలల్లోనే చిన్నారుల దత్తత పూర్తయ్యే వీలు కలుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,079 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉండగా శిశు సంక్షేమ సంస్థల్లో అందుబాటులో ఉన్న చిన్నారుల సంఖ్య 239 గానే ఉంది.
ఇలా పలు రాష్ట్రా ల్లో చిన్నారుల దత్తత కోసం ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి దత్తత సదుపాయం కల్పించేందుకు కేంద్రం ఆన్‌లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) ఇటీవల ఈ ప్రక్రియను ప్రారంభించింది. చిన్నారుల ఫొటోలను ఆన్‌లైన్‌లో వీక్షించి నచ్చిన వారిని ఎంచుకొని దత్తత స్వీకరించే వెసులుబాటు ఈ విధానంలో ఉంది.
అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు..
హా పాన్ కార్డు నంబర్‌తోనే రిజిస్ట్రేషన్ హా కుటుంబ సభ్యుల తాజా ఫోటో హా నివాస ధ్రువీకరణ (ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లెసైన్స్, విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లులలో ఏదైనా ఒకటి) హా ఆదాయ ధ్రువీకరణ (వేతన సర్టిఫికేట్, ఐటీ రిటర్న్స్ లేదా ప్రభుత్వం ఇచ్చే ఆదాయ పత్రం) హా వివాహ ధ్రువీకరణ పత్రం లేదా విడాకుల జిరాక్సు హా దత్తత కోరుతున్న వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు.
దత్తత ప్రక్రియ ఇలా..
పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్న వారు తమ పూర్తి వివరాలతో జ్ట్టిఞ://ఛ్చిట్చ.జీఛి.జీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫొటోలు, ఇతర వివరాల పత్రాలను అప్‌లోడ్ చే యాలి. రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోని చిన్నారులను దత్తత తీసుకునేందుకు కూడా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారుల దత్తత కోరుకునే వారు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సారా) అనుమతి పొందాల్సిన అవసరం లేదు. దంపతుల ఇద్దరి వయసు 90 ఏళ్ల లోపుంటేనే 0-4 ఏళ్లలోపు వయసున్న చిన్నారులను దత్తత తీసుకునేందుకు అర్హులు.
మొత్తం వయసు వందేళ్లలోపుంటే 4-8 ఏళ్లలోపు, 110 ఏళ్లుంటే 8-18 ఏళ్లలోపు బాలలను దత్తత తీసుకోవచ్చు. ఒంటరి మహిళలు, పురుషులు దత్తత కోరుతున్నట్లైతే మూడు కేటగిరీల్లోనే సగటు వయసు(45, 50, 55)ను పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారులు తమ పోలికలకు దగ్గరి పోలికలు ఉండే చిన్నారులను (ఆరుగురు చిన్నారుల లోపు), వారి ఆరోగ్య నివేదికలను ఆన్‌లైన్‌లోనే చూసుకోవచ్చు. నచ్చిన వారిని ఎంపిక చేసుకొని స్థానిక శిశు సంక్షేమ అధికారుల విచారణ అన ంతరం, న్యాయస్థానం ద్వారా దత్తత ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.