బకాయిలను చెల్లించని వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని ఈసీ ప్రతిపాదించింది.
న్యూఢిల్లీ: విద్యుత్, నీరు వంటి పౌరసేవల బకాయిలను చెల్లించని వారిని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల సంఘం కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదించింది.
ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని ఎన్నికల నేరాలకు సంబంధించిన మూడో అధ్యాయాన్ని సవరించాలని, పౌర సేవల బిల్లులను చెల్లించకపోతే పోటీకి అనర్హులనే కొత్త నిబంధన చేర్చాలని సూచించింది. ఈ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.