ప్రముఖ రచయిత్రి మాలతీ చందర్ కన్నుమూత | Famous Telugu Writer, columnist Malati Chandoor No more | Sakshi
Sakshi News home page

ప్రముఖ రచయిత్రి మాలతీ చందర్ కన్నుమూత

Published Wed, Aug 21 2013 5:52 PM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

Famous Telugu Writer, columnist  Malati Chandoor No more

చెన్నై : ప్రముఖ  రచయిత్రి, కాలమిస్ట్ మాలతీ చందర్ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా మాలతీ చందూర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందారు. తొలి మహిళ కాలమిస్టుగా గుర్తింపు సాధంచిన మాలతీ చందూర్ 1930వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు.

ప్రాధమి విద్యాభ్యాసాన్ని నూజివీడు, ఏలూరులో పూర్తి చేశారు. ఎక్కువగా చదువుకోక పోయినా ఆమె చిన్ననాటినుంచే నవలు, కథలు, విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. వీటి సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న చందూర్‌కు వివిధ అంశాలలో అవగాహన ఏర్పడింది. రచనలను కేవలం చదవడమే కాకుండా వాటిని విశ్లేషించడం ఆమె ప్రత్యేకత.

ఆంధ్రప్రభ పత్రికలో వచ్చే ‘ప్రమాదవనం’ అనే ఫీచర్‌తో మాలతీ చందూర్ మంచి గుర్తింపు పొందారు. తెలుగు పాఠకులను ఎంతగానో అలరించిన శీర్షిక అది. ఆమె అనేక పత్రికలకు వివిధ రకాల శీర్షికలను అందించారు. మాలతి చందూర్‌ దాదాపు ఆరు దశాబ్దాలుగా చెన్నైలో  నివసిస్తునారు. కేవలం రచయిత్రిగానే కాకుండా ఆమె జగతి అనే మాసపత్రికు ఎడిటర్‌తో పాటు, జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement