
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే: ఏచూరి
కోల్కతా: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించడంతో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి విమర్శించారు. బీమా రంగంలోని విదేశీ పెట్టుబడులను యూపీఏ ప్రభుత్వం హయాంలో వ్యతిరేకించిన బీజేపీ- ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తోందని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని ఎద్దేవా చేశారు. తాము తెచ్చేందుకు ప్రయత్నించిన బిల్లును ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ విషయంలో వామపక్ష పార్టీల విధానం మారలేదని ఏచూరి తెలిపారు. పెట్టుబడిదారుల చేతుల్లో బీజేపీ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.