ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖ పట్నంలో ఫిష్ మార్కెట్ను పరిశీలించారు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖ పట్నంలో ఫిష్ మార్కెట్ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఓ మత్య్సకార యువకుడు ఫిష్ మార్కెట్ వద్ద చంద్రబాబును ఉద్యోగం లేదంటూ నిలదీశాడు. తాను డీఎస్సీ క్వాలిఫై అయినా ఉద్యోగం లేదని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
దాంతో చంద్రబాబు ఆ యువకుడికి సర్దిచెప్పినట్టు తెలిసింది. వైఎస్ఆర్ పార్క్ వద్ద యాచకురాలికి రూ. 2 వేలు చంద్రబాబు ఇచ్చారు. అనంతరం రాజీవ్ స్మతిభవన్ను చంద్రబాబు సందర్శించారు.