ప్రభుత్వ ఈ-బిజ్ పోర్టల్‌లో 36 సర్వీసులు | Government plans to integrate 36 services with eBiz portal | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఈ-బిజ్ పోర్టల్‌లో 36 సర్వీసులు

Published Thu, Jun 4 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

ప్రభుత్వ ఈ-బిజ్ పోర్టల్‌లో 36 సర్వీసులు

ప్రభుత్వ ఈ-బిజ్ పోర్టల్‌లో 36 సర్వీసులు

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా ఈ-బిజ్ పోర్టల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 36 సర్వీసులను అనుసంధానం చేయాలని కేంద్రం ప్రతిపాదిం చింది. పర్యావరణ అనుమతులు, ఆస్తి పన్ను, ఫ్యాక్టరీల లెసైన్సులు మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. పెట్టుబడుల ప్రతిపాదనలన్నింటికి ఒకే చోట అనుమతులు ఇచ్చేలా ఈ-బిజ్ పోర్టల్‌కు ప్రభుత్వం రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ.. ఈ-బిజ్ పోర్టల్‌తో అనుసంధానించేందుకు 12 కేంద్ర ప్రభుత్వ సర్వీసులు గుర్తించినట్లు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) పేర్కొంది. 9 రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన 24 సర్వీసులు అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement