హూ..లలల్లా..హ్యాపీ గొరిల్లా డ్యాన్స్ | Happy Gorilla Dancing Like No One Is Watching Will Make Your Saturday | Sakshi
Sakshi News home page

హూ..లలల్లా..హ్యాపీ గొరిల్లా డ్యాన్స్

Published Sat, Jun 24 2017 11:33 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

హూ..లలల్లా..హ్యాపీ గొరిల్లా డ్యాన్స్

హూ..లలల్లా..హ్యాపీ గొరిల్లా డ్యాన్స్

నీళ్లు  చూస్తే.. ఎవరికైనా  జోష్‌ వచ్చేస్తుంది. ఇక  చిన్న పిల్లతైతే మరీ..  ఒళ్లంత.. తుళ్లింతగా కేరింతలు కొడుతూ  జలకాలాటల్లో  ఎంజాయ్‌  చేస్తారు కదా! తాజాగా హూ లలల్లా..ఏమి హాయిలే. అంటూ   ఒక గొరిల్లా  చేసిన డ్యాన్స్‌ నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఉత్సాహంతో ఊగిపోతున్న ఈ  గొరిల్లా వీడియో   సోషల్ మీడియాను షేక్‌  చేస్తోంది.

డల్లాస్  లోని ఒక జూ లోని  14 ఏళ్ళ మగ గొరిల్లా ‘జోలా’  ఇక నాకెవరు అడ్డు అన్నట్టుగా  ఎంజాయ్‌  చేసిన డ్యాన్స్‌  వీడియోని  షేర్‌ చేశారు .  ఎలాంటి బ్రేక్‌ డాన్స్‌  మ్యూజిక్‌ లేకుండానే   జోలా హ్యాపీ   డ్యాన్స్‌ అంటూ జూ అధికారులు షేర్‌ చేసిన   ఈ వీడియో లక్షల వ్యూస్‌తో   సాగుతోంది.  జూన్ 20 న  షేర్‌ చేయగా ఇప్పటికీ భారీగా షేర్‌ అవుతోంది.  7లక్షలకు పైగా వ్యూస్‌ను,  కమెంట్లను సొంతం చేసుకుని ఇంటర్‌నెట్‌ను బ్రేక్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement