బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో చిన్నారులు సమిధలవుతున్నారని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) తేల్చిచెప్పింది. గతేడాది దాడుల్లో 652 మంది చిన్నారులు చనిపోయారని తెలిపింది. సిరియాలో సంక్షోభం మొదలై ఆరేళ్లు పూర్తైన సందర్భంగా యూనిసెఫ్ ఈ వివరాలను వెల్లడించింది.
యుద్ధంలో ప్రభుత్వం, తిరుగుబాటుదారులు స్కూళ్లు, ఆసుపత్రులు, ఆట స్థలాలు, పార్కులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్యుద్ధం వల్ల దాదాపు 17 లక్షల మంది చిన్నారులు చదువుకు దూరమవగా, మరో 23 లక్షల మంది పిల్లలు పశ్చిమాసియాలో శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారని తెలిపింది.
సిరియాలో చితికిపోతున్న బాల్యం
Published Tue, Mar 14 2017 10:45 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
Advertisement