మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలుశిక్ష
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్కు మూడేళ్ల జైలుశిక్ష పడింది. దాదాపు 90 కోట్ల రూపాయల మేర ఆయన అక్రమాలకు పాల్పడినట్లు అక్కడి కోర్టు తేల్చింది. తన అధికారిక భవనాలను పునరుద్ధరించుకోడానికి ఈ డబ్బు ఖర్చుపెట్టినట్లుగా ఆయన చూపించారు.
అయితే ఈ క్రమంలో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ముబరాక్కు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. ఇవే ఆరోపణలపై ముబారక్ ఇద్దరు కుమారులకు నాలుగేసి ఏళ్ల జైలుశిక్ష పడింది. నాలుగేళ్ల క్రితం ఈజిప్టులో వచ్చిన విప్లవం ఫలితంగా ముబారక్ ఈజిప్టు అధ్యక్ష పదవి కోల్పోవాల్సి వచ్చింది.