దేశంలోని నాస్తికులు ఎంతమందో తెలుసా? | In India, just 33,000 people are atheists | Sakshi
Sakshi News home page

దేశంలోని నాస్తికులు ఎంతమందో తెలుసా?

Published Thu, Jul 28 2016 11:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

దేశంలోని నాస్తికులు ఎంతమందో తెలుసా?

దేశంలోని నాస్తికులు ఎంతమందో తెలుసా?

వేదభూమి, పుణ్యధరిత్రి.. విశ్వాసాల గడ్డ మన భారతదేశం. మరి అలాంటి మన దేశంలో ఏ మతాన్ని నమ్మనివారు, ఏ దేవుడిని విశ్వసించని నాస్తికులు ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 33వేలమంది మాత్రమే.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 120కోట్లమంది జనాభా ఉండగా.. అందులో నాస్తికులు మాత్రం అతి తక్కువగా 33వేలమంది ఉన్నారు. ఇక దేవుడిని నమ్మే విశ్వాసుల్లో (ఆస్తికులు) సగమంది మహిళలే ఉన్నారు. ప్రతి పదిమంది ఆస్తికుల్లో ఏడుగురు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఈ మేరకు గతవారం విడుదల చేసిన 2011 జనాభా లెక్కల్లో తొలిసారిగా నాస్తికుల వివరాలను వెల్లడించారు. అంతకుముందు 2001లో జరిగిన జనాభా లెక్కల్లో నాస్తికుల సంఖ్యను చెప్పకుండా కేవలం పెద్దమొత్తంలో వారు ఉన్నట్టు తెలిపారు.

అత్యధికంగా మహారాష్ట్రలో 9,652 మంది నాస్తికులు ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 256మంది నాస్తికులు ఉన్నట్టు జనాభా లెక్కలు స్పష్టం చేశాయి. లక్ష్యదీప్‌లో కేవలం ఒక్కరంటే ఒక్కరే నాసికుడు ఉండగా..పలు రాష్ట్రాల్లో 10, 14 ఇలా రెండంకెల సంఖ్యలో నాస్తికులు ఉండటం గమనార్హం. ఏ రాష్ట్రంలో ఎంతమంది నాస్తికులు ఉన్నారో ఈ కింది జాబితాలో చూడొచ్చు.  

రాష్ట్రాల వారీగా చూసుకుంటే నాస్తికుల వివరాలివి..
రాష్ట్రం                నాస్తికుల సంఖ్య
మహారాష్ట్ర           9,652
మేఘాలయ        9,089
కేరళ                 4,896
ఉత్తరప్రదేశ్         2,425
తమిళనాడు        1,297
పశ్చిమ బెంగాల్‌    784
ఒడిశా                651
ఉత్తరాఖండ్‌         572
పంజాబ్‌              569
ఎన్సీఆర్‌ ఢిల్లీ       541
గుజరాత్‌             405
అరుణాచల్‌ ప్రదేశ్    348
అండమాన్‌ నికోబార్ దీవులు  333
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్     256
హిమాచల్ ప్రదేశ్        252
అసోం                     250
హర్యానా                 180
మధ్యప్రదేశ్             136
కర్ణాటక                 112
చండీగఢ్               89
రాజస్థాన్‌              77
గోవా                   61
త్రిపుర                53    
బిహార్‌               47
పుదుచ్చేరి         44
మణిపూర్‌         39
జార్ఖండ్            36
మిజోరం           30
జమ్మూకశ్మీర్    30
నాగాలాండ్        21
ఛత్తీస్‌గఢ్‌         14
సిక్కిం              10
దాద్రా నగర్‌ హవేలి   4
లక్ష్యదీప్‌          1  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement