
ఎవరికీ భయపడలేదు: చోటా
స్పెషల్ కమాండో భద్రత ఏర్పాటు చేసిన ఇండోనేసియా పోలీసులు
బాలి: దావూద్ ముఠా సహా ఏ ప్రత్యర్థి వర్గానికీ తాను భయపడలేదని మాఫియా డాన్ చోటారాజన్ చెప్పారు. ఆస్ట్రేలియా నుంచి ఇండోనేసియాకు వచ్చిన రాజన్‌ను అక్కడి ఇంటర్‌పోల్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. బుధవారం పోలీసులు అతన్ని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రనికి తరలిస్తుండగా విలేకరులతో మాట్లాడాడు. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని మీరు భయపడుతున్నారా అని ప్రశ్నించగా, ‘నేను భయపడలేదు.
దావూద్ ఇబ్రహీం సహా ప్రత్యర్థి గ్యాంగ్‌లు ఎవరికీ భయపడలేదు’ అని పేర్కొన్నారు. స్వదేశానికి తిరిగి రావడానికి భారత నిఘావర్గాలతో ఒప్పందానికి వచ్చారా? అని అడగ్గా సమాధానం దాటవేశారు. రాజన్‌కు ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉన్న దృష్ట్యా స్పెషల్ కమాండో భద్రత ఏర్పాటు చేసినట్లు బాలి పోలీస్ కమిషనర్ చెప్పారు. ‘అతణ్ని అదుపులోకి తీసుకున్నపుడు తీవ్ర భయాందోళనతో ఉన్నట్లు కనిపించాడు. అదేపనిగా పొగతాగుతున్నాడు’ అని తెలిపారు.