ఐటీ, ఫార్మా షేర్లు బెటర్: అశ్వనీ గుజ్రాల్
Published Sat, Aug 17 2013 3:24 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
ట్రేడర్లు జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అశ్వనీ గుజ్రాల్ డాట్ కామ్ ఫండ్ మేనేజర్ అశ్వనీ గుజ్రాల్ అభిప్రాయపడ్డారు. కొనుగోళ్లకు అవకాశమున్న స్థాయిలో మార్కెట్లు ఉన్నప్పటికీ, ట్రేడర్లు రక్షణాత్మక విధానాలను అవలంబించాలని సూచించారు. రూపాయి బలహీనత వల్ల ప్రయోజనం పొందే ఐటీ, ఫార్మా వంటి ఎగుమతుల ఆధారిత పరిశ్రమల షేర్లను ఎంచుకోవడం వల్ల ఫలితం ఉంటుందన్నారు.
సమీప కాలంలో ఇబ్బందే: రాయ్‌చౌధురి
రానున్న నెల లేదా ఒక త్రైమాసికం వరకూ భారత్ మార్కెట్ల పనితీరు బాగుండే అవకాశం లేదని పీఎన్‌బీ పారిబా సెక్యూరిటీస్ ఎండీ మనీష్ రాయ్‌చౌధురి తాజా మార్కెట్ల పతనంపై అభిప్రాయపడ్డారు.
భయంతో వైదొలగవద్దు
నిఫ్టీకి 5,500-5,525 స్థాయిలో మద్దతు ఉందని అంబరీష్ బాలిగ (ఎడిల్వీస్), జిగ్నేష్ మల్కానీ (బీఎస్‌ఈ అండ్ ఎన్‌ఎస్‌ఈ సభ్యుడు) అమిత్ దలాల్ (టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్) వంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థాయిలో ఉన్న మార్కెట్ నుంచి భయంతో వైదొలగవద్దని వారు ఇన్వెస్టర్లకు సలహాఇస్తున్నారు.
Advertisement
Advertisement