ఏప్రిల్ 9 నుంచి ఆన్‌లైన్‌లో జేఈఈ-మెయిన్ | JEE-Main Online Entrance test will start from April 9 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 9 నుంచి ఆన్‌లైన్‌లో జేఈఈ-మెయిన్

Published Sat, Nov 2 2013 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

JEE-Main Online Entrance test will start from April 9

సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశానికి అర్హత పరీక్ష జేఈఈ-మెయిన్ పరీక్షను ఏప్రిల్ 9, 11, 12, 19 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు పరీక్ష నిర్వాహక సంస్థ సీబీఎస్‌ఈ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆఫ్‌లైన్ పరీక్షను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సీబీఎస్‌ఈ.. తాజాగా ఆన్‌లైన్ తేదీలను కూడా ప్రకటించింది. ఈనెల 15 నుంచి డిసెంబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. వివరాలను తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. బీఈ, బీటెక్ కోర్సులకు జేఈఈ-మెయిన్ పేపర్ 1 రాయాలని, బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ కోర్సులకు పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాయదలుచుకుంటే పరీక్ష ఫీజుగా పేపర్-1 లేదా పేపర్-2లకు జనరల్, ఓబీసీ అభ్యర్థులు బాలురు రూ. 1,000, బాలికలు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
 
 ఎస్సీ, ఎస్టీ, వికలాంగ బాలురు రూ. 500, బాలికలు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులు బాలురు రూ. 1,800, బాలికలు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు బాలురు రూ. 900, బాలికలు 900 చెల్లించాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షకు హాజరుకాగోరు అభ్యర్థులు జనరల్, ఓబీసీ అయితే బాలురు రూ. 600, బాలికలు రూ. 300, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ బాలురు రూ. 300, బాలికలు రూ. 300 చెల్లించాలి. ఆన్‌లైన్‌లో హాజరయ్యేవారికి రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ బాలురు రూ. 1,400, బాలికలు రూ. 700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ బాలురు రూ. 700, బాలికలు రూ. 700 చెల్లించాలి. కాగా, పరీక్ష రాసే అభ్యర్థులు జనరల్ కేటగిరీ అయితే అక్టోబర్ 01, 1989న, ఆ తరువాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే అక్టోబర్ 1, 1984న, ఆ తరువాత జన్మించి ఉండాలి. జేఈఈ-మెయిన్ రాసేందుకు 2012, 2013లో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు, 2014 పరీక్షలకు హాజరవబోతున్నవారు మాత్రమే అర్హులు. జేఈఈ-మెయిన్ పరీక్షను రాసేందుకు 3 సార్లు మాత్రమే అనుమతిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement