'కుక్క మాంసం తినండయ్యా..!' | Kim Jong-un labels dog meat a 'superfood' | Sakshi
Sakshi News home page

'కుక్క మాంసం తినండయ్యా..!'

Published Tue, Aug 16 2016 7:35 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

'కుక్క మాంసం తినండయ్యా..!' - Sakshi

'కుక్క మాంసం తినండయ్యా..!'

ప్యోంగ్ యాంగ్: 'ప్రియమైన ప్రజలారా.. కుక్క మాంసాన్ని కడుపారా తినండి. ఎందుకంటే.. బీఫ్, చికెన్, పోర్క్, బాతు మాంసాల కంటే కుక్కమాసం ఎంతో బలవర్ధకమైనది కాబట్టి' అని జాతికి పిలుపునిచ్చారు ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్. ఓ వైపు కుక్క మాంస భక్షణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో నార్త్ కొరియా దేశాధినేత ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్క మాంసంలో అద్భుత పోషక విలువలు ఉన్నాయని, అందులోని విటమిన్స్ మనిషికి బలాన్నిస్తాయని కిమ్ జాంగ్ అన్నట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. (కుక్క మాంసం తినకండయ్యా..)

నియంత నేతకు మద్దతుగా కొరియా అధికార టీవీ చానెల్, వార్తా పత్రికలు సైతం కుక్కమాంసం గొప్పతనంపై పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తున్నాయని 'ది కొరియా టైమ్స్' పేర్కొంది. కిమ్ కంటే ఒక అడుగు ముందుకేసి కొందరు.. 'కుక్కలను మామూలుగా తిన్పప్పటి కంటే వాటిని బాధకు గురిచేసి చంపి తింటే మరింత రుచికరంగా ఉంటాయంటూ' వాటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పెడుతున్నారు. may God save Korian Dogs!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement