హైదరాబాద్ : దేశ అభివృద్ధికి యువత కృషిచేయాలని, స్కిల్ డెవలప్‌మెంట్ మోటివేషన్ పెంచుకోవాలని యువతకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారకరామారావు సూచించారు. కూకట్‌పల్లిలోని జవహర్ లాల్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన మోడల్ యునైటెడ్ నేషన్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రగామి దేశాలతో పోల్చుకుంటే భారత దేశం వెనుకబడి ఉందని, దేశ అభివృద్ధికి యువత నడుం బిగించాలని, స్కిల్‌డెవలప్‌మెంట్ మోటివేషన్ పెంచుకోని దేశాభివృద్ధికి పాటుపడాలని ఆయన అన్నారు.
భారతదేశంలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ టెక్నాలజీని యువత అందిపుచ్చుకొని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదే విధంగా యువత భారీగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ఎవ్వరికి భయపడకుండా సొంత నిర్ణయంతో ఆలోచించి ఓటెయ్యాలని కోరారు.
దేశాభివృద్ధికి యువత కృషి చేయాలి: కేటీఆర్
Published Fri, Jan 22 2016 3:49 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement