
మోడీకి జై కొట్టిన రాజ్ థాకరే
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) మద్దతు ప్రకటించింది.
ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) మద్దతు ప్రకటించింది. అత్యున్నత పదవి రేసులో నిలిచిన మోడీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ థాకరే తెలిపారు. ప్రధాని పదవికి మోడీ అన్నివిధాలా అర్హుడన్నారు. రానున్నలోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు.
మోడీకి మద్దతు తెలిపినందుకు రాజ్ థాకరేకు బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థులకు కూడా మద్దతు పలకాలని ఆయన కోరారు. శివసేనతో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ-శివసేన కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తాయని గడ్కరీ స్పష్టం చేశారు.