పాట్నా బాధితులకు మోడీ బాసట | Narendra Modi meets Patna blasts victim’s family, hands over Rs 5 lakh cheque | Sakshi
Sakshi News home page

పాట్నా బాధితులకు మోడీ బాసట

Published Sat, Nov 2 2013 12:03 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

పాట్నా బాధితులకు మోడీ బాసట - Sakshi

పాట్నా బాధితులకు మోడీ బాసట

పాట్నా నగరంలో గత ఆదివారం వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృత్యువాత పడిన ఆరుగురు కుటుంబ సభ్యులను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శనివారం వరుసగా పరామర్శిస్తున్నారు. మొదటగా మృతుల్లో ఒకరైన రాజ్ నారాయణ్ సింగ్ స్వగ్రామమైన పాట్నా జిల్లాలోని గౌరిచౌక్ సమీపంలోని కమార్జి  గ్రామానికి శనివారం ఉదయం మోడీ చేరుకున్నారు. రాజ్ నారాయణ్ సింగ్ కుటుంబాన్ని మోడీ పరామర్శించారు.

 

అనంతరం ఆ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును ఆయన అందజేశారు. అనంతరం మరో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మోడీ కైమురు జిల్లాకు పయనమైయ్యారు. అక్కడి నుంచి నలందా, బెగుసరాయి, సుపాల్, గోపాల్గంజ్లోని మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. అయితే మోడీ పర్యటించే ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అందుకోసం భారీగా భద్రత దళాలను మోహరించారు.



గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గత ఆదివారం పాట్నా నగరంలో గాంధీ మైదాన్ల హూంకార్ ర్యాలీ బహిరంగ నిర్వహించారు. అయితే ఆ రోజు ఉదయం పాట్నా రైల్వే స్టేషన్ వద్ద బాంబు పేలుడుతోపాటు... గాంధీ మైదాన్ వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.

 

మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ఘటనతో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఈ పేలుడుకు బాధ్యులని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు అమర్చుకుంటుండగా ప్రమాద వశాత్తు బాంబు పేలి ఒక నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో పోలీసులు అతడిని పాట్నాలోని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. తీవ్ర గాయాలతో నిందితుడు కోమాలోకి వెళ్లాడు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  నిందితుడు నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. మోడీ పర్యటనలో ఆయన వెంటన ఆ పార్టీ సీనియర్ నేత నంద కిషోర్ యాదవ్ ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement