ఈరోజు.. రాజకీయాలు మాట్లాడే రోజు కాదు! | Not a day of politics, will talk tomorrow: Rahul on PM speech | Sakshi
Sakshi News home page

ఈరోజు.. రాజకీయాలు మాట్లాడే రోజు కాదు!

Published Sat, Aug 15 2015 12:43 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఈరోజు.. రాజకీయాలు మాట్లాడే రోజు కాదు! - Sakshi

ఈరోజు.. రాజకీయాలు మాట్లాడే రోజు కాదు!

న్యూఢిల్లీ:భారత 69వ సాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై  మాట్లాడటానికి  కాంగ్రెస్ నిరాకరించింది. ఈరోజు రాజకీయాలు మాట్లాడటం సరైన సందర్భం అనిపించుకోదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు, తల్లి సోనియా గాంధీతో కలిసి రాహుల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 

అనంతరం నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై తన అభిప్రాయాన్నిమీడియా అడగ్గా  రాహుల్ ఈ విధంగా స్పందించారు. 'నేడు రాజకీయ పరమైన అంశాలను ప్రస్తావించడం తగదు. ఒకవేళ ఏమైనా మాట్లాడాల్సి వస్తే రేపు మాట్లాడదాం' అని తెలిపారు. ఇదిలా ఉండగా సోనియా గాంధీ కూడా ప్రధాని ప్రసంగంపై మాట్లడటానికి నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement