ఆ గుడి ప్రాంగణంపై చాపర్ల చక్కర్లు వద్దు!
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాధ్ ఆలయంపై భాగం మీదుగా హెలికాప్టర్లు, విమానాలు ప్రయాణించేందుకు అనుమతించొద్దని కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర సర్కారు లేఖ రాసింది. జూలై 18, 26, 27 తేదీల్లో ఆలయానికి సంబంధించి నబకళేబర ఉత్సవాలు జరుగుతున్నందున్న ఆలయ భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలో గగన తల మార్గానికి అనుమతించకూడదని కోరారు.
ఈ మేరకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్, భువనేశ్ర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ డైరెక్టర్ బిజు పట్నాయక్ కు లేఖలు రాసింది. వాటి వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించింది. పూరీలోని జగన్నాథ ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైనది.