పాక్లో తాత్కాలికంగా ఉరిశిక్ష నిలిపివేత ! | Pakistan to halt executions in Ramazan | Sakshi
Sakshi News home page

పాక్లో తాత్కాలికంగా ఉరిశిక్ష నిలిపివేత !

Published Sun, Jun 14 2015 12:31 PM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM

పాక్లో తాత్కాలికంగా ఉరిశిక్ష నిలిపివేత ! - Sakshi

పాక్లో తాత్కాలికంగా ఉరిశిక్ష నిలిపివేత !

ఇస్లామాబాద్: దేశంలో ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఉరిశిక్షలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆ ఆదేశాలలో పాక్ ప్రభుత్వం పేర్కొంది. గతేడాది డిసెంబర్ 17వ తేదీన పేషావర్లో ఆర్మీ పాఠశాలపై తాలిబన్ తీవ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 150 మంది మరణించారు.

మృతుల్లో చాలా మంది విద్యార్థులే.  అయితే ఉరిశిక్ష విధించబడి...  దేశంలో వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు ఉరి శిక్ష అమలు చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాటి నుంచి దేశంలోని పలు జైళ్లలో ఉన్న ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement