న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పెరుగుతున్న ఊబకాయం సమస్య పరిష్కారానికి కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ నియమించిన కమిటీ సిఫారసులు చేసింది. పాఠశాలల్లోని క్యాంటీన్లలో, స్కూళ్లకు 200 మీటర్ల పరిధిలో జంక్ ఫుడ్ అమ్మకాల్ని నిషేధించాలని సూచించింది. జంక్ ఫుడ్ పదార్ధాలను స్కూల్ సమయాల్లో, స్కూల్స్ దగ్గరలో వీటిని అమ్మకుండా చూడాలని పేర్కొంది.