జమ్మూకశ్మీర్ శాసనసభల్లో పోటీ చేసిన రాజకీయ ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభల్లో పోటీ చేసిన రాజకీయ ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పలువురు గెలుపొందగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. పీడీపీ అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ సయ్యిద్ గెలుపొందారు. అనంతనాగ్ స్థానం నుంచి 6 వేల పైచిలుకు ఓట్లతో నెగ్గారు.
వేర్పాటువాద మాజీ నాయకుడు సాజిద్ గనీ లోన్ కూడా విజయం సాధించారు. హంద్వారా అసెంబ్లీ స్థానం నుంచి 4800 పైగా ఓట్లతో గెలిచారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్ ఓటమి పాలయ్యారు. ఛాంబ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తారాచంద్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కిషన్ లాల్ చేతిలో 14,790 ఓట్లతో ఓడిపోయారు. మాజీ బ్యాంకర్ హసీబ్ డ్రాబు రాజ్పొరా స్థానం నుంచి గెలుపొందారు.