సిలబస్‌లో లేని ప్రశ్నలు.. అక్షరదోషాలు! | Questions that are not in the syllabus | Sakshi
Sakshi News home page

సిలబస్‌లో లేని ప్రశ్నలు.. అక్షరదోషాలు!

Published Mon, Sep 12 2016 4:21 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM

సిలబస్‌లో లేని ప్రశ్నలు.. అక్షరదోషాలు! - Sakshi

సిలబస్‌లో లేని ప్రశ్నలు.. అక్షరదోషాలు!

ఎంసెట్-3లో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ప్రశ్నల్లో గందరగోళం

ఆప్షన్లు గుర్తించలేక ఇబ్బందిపడ్డ విద్యార్థులు

 

 సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ఎంసెట్-3 పరీక్షలో కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ ప్రశ్నలు విద్యార్థులను కొంత గందరగోళానికి గురిచేశాయి. సిలబస్‌లో లేని ప్రశ్నలు రావడంతోపాటు కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానాలు లేవని, దీంతో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చిందని సబ్జెక్టు నిపుణులు తెలిపారు. ఫిజిక్స్‌లోనూ కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని, జువాలజీలో ఒక ప్రశ్నకు రెండు సరైన ఆప్షన్లను ఇవ్వగా, మరో మూడు ప్రశ్నల్లో అక్షర దోషాలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణుడు మురళీకృష్ణ పేర్కొన్నారు.
 

 తగ్గిన హాజరు శాతం..
తెలంగాణ, ఏపీలోని 96 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్-3 నిర్వహించారు. పరీక్షకు విద్యార్థుల హాజరు శాతం భారీగా తగ్గింది. తెలంగాణలో దరఖాస్తు చేసుకున్న వారిలో 72.14% మంది, ఆంధ్రప్రదేశ్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో 53.70% మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో కలిపి పరీక్ష రాసేందుకు 56,153 మంది విద్యార్థులకు అవకాశం కల్పించగా.. పరీక్షకు 37,199 మంది (66.26) మాత్రమే హాజరయ్యారు. ఎంసెట్-2తో పోలిస్తే 24% మేర పరీక్షకు గైర్హాజరయ్యారు. ఎంసెట్-2 పరీక్షకు 90.76% (50,964 మంది) విద్యార్థులు హాజరు కాగా ఆదివారం నాటి పరీక్షకు 66.26% మంది హాజరయ్యారు. ఇందులో తెలంగాణలో 38,214 మంది విద్యార్థులకుగాను 27,566 మంది హాజరయ్యారు. 10,648 మంది గైర్హాజరయ్యారు. ఏపీలోని కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో 17,939 మందికిగాను 9,633 విద్యార్థులు పరీక్ష రాశారు. 8,306 మంది గైర్హాజరయ్యారు. మరోవైపు ఎంసెట్-3 ర్యాంకులను ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు.

 

 మెయిల్ ద్వారా అభ్యంతరాలు తెలపండి: కన్వీనర్ యాదయ్య

ఎంసెట్-3 ప్రాథమిక ‘కీ’ పేపర్‌ను కన్వీనర్ ఎన్.యాదయ్య ఆదివారం అందుబాటులో ఉంచారు. నాలుగు సెట్ల ప్రశ్నపత్రాల జవాబులకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ను ఎంసెట్.ఇన్ వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ అభ్యంతరాలను ఈ-మెయిల్ objections@tseamcet.in ద్వారా ఈనెల 14వ తేది సాయంత్రం 4 గంటలలోపు తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలు తెలియజేయాల్సిన విధానాన్ని వెబ్‌సైట్‌లో సూచించారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, సెట్ కోడ్, ప్రశ్న సంఖ్య, సరైన సమాధానం, అందుకు తగిన ఆధారాలు (వివరణ) ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు.

 

 ఎంసెట్ ప్రశాంతం

కేయూ క్యాంపస్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ఎంసెట్-3 వరంగల్‌లో ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు, ఫొటోలు తీశారు. నిర్ణీత సమయం ఉదయం 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కేంద్రంలో ముగ్గురు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయూరు. జిల్లాలో మొత్తం 8 కేంద్రాల్లో 3,497 మంది పరీక్షలకు హాజరయ్యారని రీజినల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు.
 

 నిపుణుల అంచనాల ప్రకారం ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులు, దోషాలివీ..

 ‘సి’ కోడ్ ప్రశ్నపత్రంలోని కెమిస్ట్రీ ప్రశ్నల్లో..

► 137 ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఇచ్చారు. 1వ ఆప్షన్, 4వ ఆప్షన్ కూడా సరైన సమాధానమే

► 149వ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో సరైన జవాబు లేదు  128, 152, 155, 160 ప్రశ్నలు ఇంటర్మీడియెట్ సిలబస్‌లో లేవు

►140, 148, 154 ప్రశ్నల్లో ఫార్ములాలు తప్పుగా ఉన్నాయి. కానీ ఎలిమినేషన్‌లో (తప్పుడు ఆప్షన్లను ఏరివేయడం ద్వారా) సరైన సమాధానం ఎంచుకోవచ్చు

 

 ‘సి’ కోడ్ ప్రశ్నపత్రంలోని జువాలజీ ప్రశ్నల్లో..

42వ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో రెండూ సరైన సమాధానాలు ఉన్నాయి. 1వ ఆప్షన్‌తోపాటు 3వ ఆప్షన్ కూడా సరైనదే  50వ ప్రశ్నలో టీసీ (సబ్‌స్క్రిప్ట్) బదులు టీహెచ్ అని తప్పుగా ఇచ్చారు  68వ ప్రశ్నలో ఎగ్జోక్రైన్ అని ఇవ్వాల్సి ఉండగా, ఎండోక్రైన్ అని తప్పుగా ఇచ్చారు  72వ ప్రశ్న రూపకల్పన సరిగా లేదు


 ‘సి’ కోడ్ ప్రశ్నపత్రంలోని బోటనీ ప్రశ్నల్లో..

► 14వ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో సరైన జవాబు లేదు

► 16వ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు ఆప్షన్లు సరైనవి ఉన్నాయి. 1, 3వ ఆప్షన్ రెండూ సరైన జవాబులే  29వ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో మూడు సరైనవి ఉన్నాయి

► 18, 31వ ప్రశ్నల రూపకల్పన గందరగోళంగా ఉంది

 ‘డి’ కోడ్ ప్రశ్నపత్రంలోని ఫిజిక్స్ ప్రశ్నల్లో.. 83, 116వ ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement