రాహుల్ కు పాలనా మనస్తత్వం లేదు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై ఇప్పటికే పలువురు సొంత పార్టీ నేతల నుంచి విమర్శలెదుర్కొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు గోవాలోని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో రాహుల్ నాయకత్వ లక్షణాలను పరోక్షంగా ప్రశ్నించారు. ఆయన కేవలం అన్యాయాలపై పోరాడేందుకే ఇష్టపడతారని...ఆయనలో పాలనా మనస్తత్వం లేదని చెప్పుకొచ్చారు. కీలక బాధ్యతలు చేపట్టే విషయంలో రాహుల్ ఎందుకు వెనక అడుగు వేస్తుంటారన్న ప్రశ్నకు దిగ్విజయ్ పైవిధంగా బదులిచ్చారు.
లోక్‌సభలో రాహుల్ కాంగ్రెస్‌పక్ష నాయకుడిగా ఎందుకు కాలేకపోయారన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్థానం అవసరం. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద ప్రతిపక్ష బృందం కాబట్టి రాహుల్ గాంధీ ఆ బాధ్యతను చేపట్టి ఉండాల్సింది’’ అని అన్నారు.