ఏపీ, తెలంగాణ సీఎంలకు రాజ్నాథ్ ఫోన్
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను పెనువేగంతో దూసుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వచ్చే 24 గంటల్లో తీరప్రాంతాలపై హుదూద్ తుపాను ప్రభావం చూపనుందని వాతావరణ కేంద్రం పేర్కొనడంతో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కనిపెట్టి చూస్తోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు. తుఫాన్ ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావిత రాష్టాలకు అవసరమైన సాయం అందిస్తామని హాహీయిచ్చారు. కాగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లు, ఎయిర్క్రాఫ్ట్ర్ లను సిద్దం చేసింది.