ప్రభుత్వాన్ని నడిపేది ఆర్ఎస్ఎస్ కాదు: రాజ్నాథ్ | RSS not running the govt: Rajnath | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని నడిపేది ఆర్ఎస్ఎస్ కాదు: రాజ్నాథ్

Published Sat, Sep 5 2015 4:30 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ప్రభుత్వాన్ని నడిపేది ఆర్ఎస్ఎస్ కాదు: రాజ్నాథ్ - Sakshi

ప్రభుత్వాన్ని నడిపేది ఆర్ఎస్ఎస్ కాదు: రాజ్నాథ్

పుణె: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తున్నదన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తిప్పికొట్టారు. ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నడిపిస్తోందనడంలో ఎలాంటి నిజం లేదని, అది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. శనివారం పుణెలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

'అవును.. నేను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయం సేవకులమే. అందులో ఎలాంటి సందేహంలేదు. ఇందులో ఎవరు ఎలాంటి ఇబ్బందికి గురికావాల్సిన పనిలేదు' అని రాజ్నాథ్ అన్నారు. అత్యున్నత పదవిలో ఉంటూ ప్రభుత్వ రహస్యాలను ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థకు నివేదించారన్న అరోపణలపై స్పందిస్తూ.. 'ఆర్ఎస్ఎస్- బీజేపీ సమన్వయ సమావేశంలో అలలిలాంటి అంశాల ప్రస్తావనే లేదు. అయినా సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన వాగ్దాన భంగం జరిగిందనడం వట్టిమాటే' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ వేదికగా బుధ, గురు, శుక్రవారాల్లో జరిగిన ఆర్ఎస్ఎస్- బీజేపీ సమన్వయ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలపై అటు కాంగ్రెస్ తో పాటు పలు విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement