ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు రాజ్యసభ స్థానాలతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ మంగళవారం ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు రాజ్యసభ స్థానాలతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ మంగళవారం ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారమే ప్రారంభం కాగా.. తొలిరోజు రాష్ట్రం నుంచి ఒక్కటి కూడా దాఖలు కాలేదు. ఈ నెల 28 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.
29న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 31 వరకు గడువు ఉంది. ఏకగ్రీవం లేని స్థానాలకు పోలింగ్ ఫిబ్రవరి 7న జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఆరు స్థానాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఏడో అభ్యర్థి రంగంలో నిలిస్తే పోలింగ్ నిర్వహించాల్సి వస్తుంది.